TG: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో కురిసిన ఈదురుగాలుల వర్షానికి జగిత్యాల, సారంగపూర్, కోరుట్ల, ధర్మపురి, రాయికల్ మండలాల్లో పంటలకు నష్టం వాటిళ్లింది. వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతినగా, మామిడి కాయలు నేలరాలాయి. నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.