కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాలో తోటి నటీనటులతో పాటు అందరినీ అన్‌ఫాలో చేయడం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాజాగా ఆయన తాను ఫాలో అవుతున్న వారందరినీ తొలగించి, కేవలం తన భార్య, సొంత అఫీషియల్ అకౌంట్లను మాత్రమే ఫాలో అవుతున్నాడు. హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ను కూడా ఆయన అన్‌ఫాలో చేయడం గమనార్హం.