JGL: జగిత్యాల జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. ధర్మపురి మండలంలో 50 ఎకరాల్లో పంట నేలకొరగగా, జిల్లావ్యాప్తంగా సుమారు వందల ఎకరాలకు నష్టం వాటిల్లినట్లు రైతులు పేర్కొంటున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఈ నష్టం జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.30 వేల ఖర్చుతో సాగు చేసిన పంటను అకాల వర్షంతో నష్టపోయమన్నారు.