E.G: రాజానగరంలోని ‘సీ కన్వెన్షన్’ హాల్లో ‘పీ-4’ కార్యక్రమ మొదటి వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ వేడుకల్లో MLA బత్తుల బలరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. పీ-4 పథకం ద్వారా సమాజంలోని వెనుకబడిన వర్గాలకు మెరుగైన అభివృద్ధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏడాది కాలంలో ఈ పథకం ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తరిస్తామని పేర్కొన్నారు.