దేశంలో మావోయిస్టులు లేకుండా చేసేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌కు డెడ్‌లైన్ ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో మావో నేతలు లొంగిపోయారు. అగ్రనేత గణపతి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారని, ఆయనతో సహా మావోయిస్టులు సరెండర్ కావాలని DGP శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. రెండేళ్లలో 721 మంది లొంగిపోయారని, తెలంగాణకు చెందిన ఆరుగురు అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు.