ప్రకాశం: సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడులో జరుగుతున్న తిరుణాల సందర్భంగా కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాసరావు చేపట్టారు. డీఎస్పీ తిరుణాల ప్రాంగణాన్ని సందర్శించి, బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ భద్రతా చర్యలు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.