ASR: డుంబ్రిగూడ(M)బిజుమరవలస గ్రామానికి చెందిన కిల్లో బాబి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. ఇండో-నేపాల్ ఇంటర్నేషనల్ సిరీస్ పోటీలు నేపాల్లో ఈ నెల 26 నుంచి 30 వరకు జరిగాయి. YGCI ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో పాల్గొన్న బాబి, 100 మీటర్ల పరుగులో సిల్వర్ మెడల్ సాధించారు. ఈ విజయంతో గ్రామస్థులు, స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.