KKD: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “జీరో పావర్టీ–P4” కార్యక్రమం విజయవంతంగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా పిఠాపురం పాడా ఆఫీస్లో ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కూటమి ప్రజా ప్రతినిధులు, అధికారులు, బంగారు కుటుంబాలు, మార్గదర్శులు హాజరయ్యారు. P4 కార్యక్రమ అమలు, విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు.