SDPT: జిల్లాలో 2025-26 రబీ వరి ధాన్యం సేకరణపై కలెక్టర్ హైమావతి సోమవారం రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 421 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నట్లు వెల్లడించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలని, ధాన్యం సేకరణలో మిల్లర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆమె ఆదేశించారు.