SRPT: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే చర్యలు తీసుకుని పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం సూర్యాపేటలోని కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణిలో 78 దరఖాస్తులు వచ్చాయన్నారు.