PDPL: నేషనల్ గ్రీన్ కార్ప్ ఆదేశాల మేరకు మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు సోమవారం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగిరి మండలం రత్నాపూర్ సెగ్రిగేషన్ షెడ్‌కు తీసుకెళ్లి వ్యర్థాల వేరుచేసే విధానాలను ప్రత్యక్షంగా చూపించారు. జిల్లా స్వచ్ఛ భారత్ కో- ఆర్డినేటర్ రాఘవ తడిచెత్తతో ఎరువు తయారీ, పొడిచెత్త రీసైక్లింగ్ విధానాలను వివరించారు.