ASR: లాడ్జీలలో మైనర్లను పనిలో పెట్టుకోవద్దని హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షురాలు డా.కంబిడి కృష్ణకుమారి స్పష్టం చేశారు.సోమవారం అరకులోయలో పలు లాడ్జిలను ఆమె పరిశీలించారు. సరైన గుర్తింపు పత్రాలు పరిశీలించిన తరువాతే గదులను కేటాయించాలని సూచించారు. సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు పని చేయాలని అన్నారు. ఎటువంటి అనర్థాలు జరగకుండా యాజమాన్యాలు చూసుకోవాలన్నారు.