KNR: చొప్పదండి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బందిని సొంత పనులకు వినియోగిస్తున్నారని బీజేపీ నాయకుడు తాడూరి శివకృష్ణ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సిబ్బందితో పాటు మున్సిపల్ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుంటున్నారని, దీంతో పట్టణంలో పారిశుద్ధ్య పనులు దెబ్బతింటున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు.