MDK: రామాయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. గ్రామంలోని బస్సు షెల్టర్ శిథిలావస్థకు చేరి ప్రయాణికులు ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన ఆమె, ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా సొంత ఖర్చుతో మరమ్మతులు చేయించారు. షెల్టర్‌ను పూర్తిగా బాగు చేయించి, ఆకర్షణీయమైన రంగులు వేయించి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు.