NGKL: బల్మూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని సర్పంచ్ శిరీష, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ తారా సింగ్ ప్రారంభించారు. ఈ శిబిరంలో 220 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.