కడప: రెండేళ్లుగా కడపలోని టిడ్కో ఇళ్లకు కనీస వసతులు కల్పించకపోవడం దారుణమని CPI నేత వెంకటశివ విమర్శించారు. సోమవారం జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవితకు వినతిపత్రం ఇచ్చిన ఆయన, పెండింగ్ పనులు పూర్తిచేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కరెంటు, నీరు లేక ఇళ్లు చెదలు పడుతున్నాయని, వెంటనే మరమ్మతులు చేసి సిటీ బస్సు సౌకర్యంతో లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని కోరారు.