ATP: తాడిపత్రి మండలం గన్నేవారిపల్లెలో టిడ్కో గృహ ప్రవేశాల కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. జిల్లా కలెక్టర్ ఆనంద్, MLA జేసీ అస్మిత్ రెడ్డి కలిసి మొదటి విడతలో 1024 మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం నాణ్యతతో పూర్తి చేసి, మౌలిక సదుపాయాలు కల్పించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.