AKP: జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి సోషల్ పరీక్షకు 74 మంది గైర్హాజర్ అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. జిల్లాలో 102 పరీక్ష కేంద్రాల్లో 20,764 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 20,690 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లాలో 11 పరీక్ష కేంద్రాలను తను తనిఖీ చేసినట్లు తెలిపారు.