VKB: దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో అంబేద్కర్ యువజన సంఘం సోమవారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా గట్టు రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడిగా గుద సురేష్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా గూనిగారి అంజలి, ఆదిత్య శ్రీనివాస్, సండి శ్రీనివాస్, ఎర్ర రవీందర్, బైండ్ల నర్సింలు బాధ్యతలు చేపట్టారు.