KRNL: రైతుల అభివృద్ధికి పశుసంపద కీలకమని మంత్రాలయం మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్న పేర్కొన్నారు. కల్లుకుంటలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యదర్శి రాఘవేంద్ర, పశు వైద్యాధికారి దినకర్‌తో కలిసి సోమవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో పశువులకు టీకాలు, మందులు అందజేశారు. గతంలో పశుసంపద నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు.