ATP: అనంతపురం నగరపాలక కార్పొరేషన్లో వార్డుల సంఖ్యను పెంచుతూ పురపాలక పరిపాలన కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. దీని ప్రకారం నగరంలో ప్రస్తుతం ఉన్న 50 వార్డుల సంఖ్య 62కు పెరిగింది. ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల మేరకు ఈ సంఖ్య పెరిగింది. ఈ నిర్ణయంతో రాబోయే ఎన్నికల్లో కార్పొరేటర్ల సంఖ్య పెరగనుంది.