WNP: ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఆక్రమిత డబ్బాలు తొలగించేందుకు మున్సిపల్ అధికారులు, పాలకమండలి నిర్ణయం తీసుకున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ బాధితులు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని ఆశ్రయించారు. కొన్ని ఏళ్లుగా డబ్బాలు వేసుకొని ఉపాధి పొందుతుంటే, అధికారులు తొలగిస్తే ఎక్కడికి పోవాలని చెప్పారు. మంత్రి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని తెలిపినట్లు వారు పేర్కొన్నారు.