E.G: కడియం మండలం కడియపులంక శ్రీ హరిహర మహా క్షేత్రంలో కొలువైయున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికలో కళ్యాణాన్ని పండితులు శాస్త్రక్తంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ మార్గాన్ని సత్యనారాయణ లక్ష్మి దంపతులు సంప్రదాయంగా పట్టు వస్త్రాలను సమర్పించారు.