AKP: నర్సిపురం గ్రామంలోని ఓలేటి ఫారం వద్ద బాలాజీ నగర్లో రహదారి లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడినప్పుడు ప్రాంతం మొత్తం జలమయమై, రాకపోకలు కష్టంగా మారుతున్నాయని స్థానికులు తెలిపారు. అత్యవసర సమయంలో కూడా బయటకు వెళ్లడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు.