AP: శ్రీకాళహస్తి ఆలయ వీడియో వివాదంపై ఎమ్మెల్యే సుధీర్ క్లారిటీ ఇచ్చారు. వీడియోలో మహిళ చేసిన ఆరోపణలు అవాస్తవమన్నాడు. ఆలయంలో ఎవరూ డబ్బులు అడగలేదని, 9 నిమిషాల పాటు మహిళ దర్శనం చేసుకుందని వెల్లడించారు. ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని, సమస్యలుంటే టోల్ ఫ్రీకి ఫిర్యాదు చేయాలన్నారు. నిరాధారణ ఆరోపణలపై చర్యలు తీసుకుంటామని, దళారీ వ్యవస్థను అరికట్టామన్నారు.