TPT: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన ఓబులేషు (38) పలు పేర్లు మార్చుకుని ప్రజలను మోసం చేశాడు. సిగరెట్లు, చక్కెర హోల్సేల్ వ్యాపారం పేరుతో రూ.లక్ష పెట్టుబడికి రోజుకు రూ.3 వేలు ఇస్తానని నమ్మబలికి, తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో సుమారు రూ.8 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు అతన్ని ఇవాళ అరెస్ట్ చేశారు.