VKB: ఇందిరమ్మ ఇళ్లకు అవసరమయ్యే ఇసుక తరలించేందుకు మన ఇసుక వాహనం యాప్ ద్వారా అనుమతులు జారీ చేస్తున్నట్లు ఎంపీడీవో విశ్వప్రసాద్ తెలిపారు. పాత తాండూర్, వీర్షెట్పల్లి, చిట్టి ఘనపూర్, కాగ్న నది నుంచి ఇసుక పొందేందుకు యాప్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ట్రాక్టర్కు రూ.214 చెల్లించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.