MNCL: క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధి కోదండ రామాలయాన్ని మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదివారం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సాయం అందించిన సుమన్‌ను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.