KRNL: సీఎం చంద్రబాబు.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్, దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్ అని MP బైరెడ్డి శబరి కొనియాడారు. మహానాడు సామాన్య పండుగ కాదని, పసుపు సైన్యం గర్జనని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నా అధినేత వెనుకడుగు వేయకుండా అందరికీ అండగా నిలిచారన్నారు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదని, గల్లీ నుంచి ఢిల్లీ దాకా టీడీపీ జెండా ఎగురుతోందని పేర్కొన్నారు.