SRCL: వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన సుద్దాల వేణు అనే గల్ఫ్ కార్మికుడు బుధవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామంలో ఉపాధి కరువై అప్పులు చేసి గల్ఫ్ దేశమైన మాల్దీవులకు వెళ్ళాడు. అక్కడ సరైన ఉపాధి లేకపోవడంతో స్వగ్రామానికి వచ్చి, సిరిసిల్లలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అప్పుల బాధలు పెరిగిపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.