MHBD: కొత్తగూడ మండలంలో CMRF చెక్కులు మాయమవుతున్నాయని BRS పార్టీ మండల అధికార ప్రతినిధి నెహ్రూ నాయక్ ఆరోపించారు. పేద రోగులకు అందాల్సిన సహాయం అధికారుల కనుసన్నల్లో దారి మళ్లుతున్నదని ఆయన విమర్శించారు. బాధితులకు న్యాయం చేయాలని, చెక్కుల పంపిణీలో పారదర్శకత తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.