NLG: జిల్లాలోని గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలలు 2026-27 విద్యాసంవత్సరానికి వెంటనే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని, లేనిచో వాటిని సీజ్ చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం హెచ్చరించింది. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించే ముందే పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో సరిచూసుకోవాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఎటువంటి వ్యాపారాలు నిర్వహించరాదన్నారు.