AP: టీడీపీ మహానాడులో మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. మహిళా బిల్లు పాస్ అయినా.. కాకపోయినా.. మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. ఇది తమ నినాదం కాదని.. నిర్ణయమని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో మహిళా ఆధిపత్యమే కొనసాగుతుందని తెలిపారు.