మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21 డివిజన్లో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. ఇంట్లో మధ్యలోకి నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ మంజుల శ్రీశైలం మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించి పారిశుధ్య చర్యలను చేపట్టారు.