E.G: అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి హెల్త్ డైరెక్టరేట్ నుంచి అరుదైన గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామగుర్రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సహకారంతో ఆసుపత్రి సాధించిన అభివృద్ధి, వైద్య సేవలకు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేవీఎన్ చక్రధర్ బాబు ప్రశంసా పత్రాన్ని జారీ చేశారన్నారు.