NDL: బేతంచెర్లలో ఏఐటీయూసీ రెండవ మండల మహాసభలు ఘనంగా ఆదివారం జరిగింది. కార్మిక హక్కులను కాపాడాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. పి. సుంకయ్య, ఎన్. రంగనాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలపై పోరాటాలకు సిద్ధమని తెలిపారు. ఈ సందర్భంగా ఏలియా, తిరుమలేష్లను అధ్యక్ష, కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.