కృష్టా: తెలుగు ప్రజల గుండెచప్పుడు తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఇవాళ గుడివాడలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి, టీడీపీ జెండా ఎగరవేశారు. సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు అని నినదించిన ఎన్టీఆర్ స్పూర్తితో తామంతా ముందుకు వెళుతున్నామన్నారు.