NDL: ఏప్రిల్ 6, 7 తేదీల్లో నందికొట్కూరులో జరగనున్న ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పట్టణ కార్యదర్శి ధనుంజయ్ పిలుపునిచ్చారు. మంగళవారం నంద్యాలలోని జ్ఞానపురం, మూలసాగరం ప్రాంతాల్లో శానిటేషన్ కార్మికులతో సమావేశమై మహాసభలకు హాజరు కావాలని కోరారు. కార్మిక హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యత అవసరమని ఆయన పేర్కొన్నారు.