NLG: దేవరకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవీ విరమణ పొందుతున్న రెబెకా సదానందంని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల నుంచి విద్యను ఆయుధంగా తీసుకుని ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన రెబెకా సదానందం మూడు దశాబ్దాలకు పైగా అపారమైన నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావంతో పనిచేశారన్నారు.