TG: కేసీఆర్ గత కేబినెట్ కూర్పు చూస్తే SCలపై వ్యతిరేకత కనిపిస్తుందని CM రేవంత్ ఆరోపించారు. ‘భట్టిని ప్రతిపక్ష నేతను చేస్తే ఫిరాయింపులతో ఆ పదవి లేకుండా చేశారు. SCలపై కక్ష సాధింపు తప్ప కనీస మానవత్వం చూపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రిని చేశాం. భట్టిని వ్యక్తిగతంగా అవమానించేలా హరీష్, KTR ప్రవర్తించారు’ అంటూ మండిపడ్డారు.