AKP: నర్సీపట్నంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రైతు మహిళల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెటర్నరీ డాక్టర్ నరేష్ మాట్లాడుతూ.. మహిళా రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ముఖ్యంగా పాడిపంట అభివృద్ధి చేయడంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.