AP: నెల్లూరు బోట్ల చోరీపై దర్యాప్తు చేయాలని ఎంపీ బీద మస్తాన్ రావు డిమాండ్ చేశారు. పాండిచ్చేరి బోట్లు విడుదల చేయించినట్లు.. తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ ఎదుగుదలకు మత్స్యకారులే కారణమని పేర్కొన్నారు. ఈ వివాదంలోకి తనను అనవసరంగా లాగుతున్నారని, బోట్ల వ్యవహారంలో తన ప్రమేయం ఉందని నిరూపిస్తే.. రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.