అన్నమయ్య: రాయచోటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిషేధితభూముల రిజిస్ట్రేషన్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అబ్బవరం గ్రామంలోని సర్వే నెం.13/2 ప్రభుత్వ భూమిగా,సెక్షన్ 22(A) ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ పలువురు డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు జరిపినట్లు అధికారులు గుర్తించారు. జిల్లా రిజిస్ట్రార్ నివేదిక ఆధారంగా డీఐజీ ఆదేశాలతో అధికారిని సస్పెండ్ చేశారు.