NRML: జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా గడువులోగా కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద నీడ, తాగునీటి వసతి కల్పించాలని, తగినన్ని గన్నీ బ్యాగులు, తూకపు యంత్రాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.