నంద్యాల జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. బనగానపల్లెలో 66, డోన్‌లో 21, ఆత్మకూరులో 172, నంద్యాలలో 227 మ్యుటేషన్లు SLA గడువు దాటి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆమె సూచించారు.