ATP: జిల్లా ప్రజల ఆశాజ్యోతి అయిన ఆర్డీటీ సంస్థ సేవలను కొనసాగించేలా సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జిల్లా నేతలు శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. విదేశీ నిధుల పునరుద్ధరణకు కృషి చేసిన మంత్రి నారా లోకేష్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు ఈ సందర్భంగా పలువురు నేతలు ధన్యవాదాలు తెలిపారు.