ASF: సిర్పూర్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసెంబ్లీలో సిర్పూర్ MLA హరీష్ బాబు శనివారం ప్రస్తావించారు. వేసవి కాలం నేపథ్యంలో ప్రతి గ్రామానికి కనీసం రెండు బోర్వెల్స్ ఈ ఏడాదిలోనే మంజూరు చేయాలని కోరారు. అయితే కనీసం బోరు వేయాలన్నా MLAలు, కలెక్టర్ల వద్ద నిధులు లేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.