కృష్ణా: బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రేపు కురుమద్దాలి గ్రామంలో, బుధవారం గడ్డిపాడులో శిబిరాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.