KNR: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన జవ్వాజి కుమార్ (జేకే) ఏకగ్రీవంగా నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ ఆదేశాల మేరకు జిల్లా కన్వీనర్ కనకం కుమారస్వామి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. కుమార్ మాట్లాడుతూ.. ఉద్యమకారుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు.