NZB: ధర్పల్లి PACS కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు రైతులతో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి జీ. సంతోష్ రెడ్డి తెలిపారు. సింగిల్ విండో పరిధిలోని సభ్యత్వం కలిగిన గ్రామాల రైతులందరూ ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు. 6 నెలల కాలానికి సంబంధించిన జమ, ఖర్చుల వివరాలను ఈ సందర్భంగా సభ్యులకు వివరించనున్నారు.